జహీరాబాద్‌లో ఘనంగా బోనాలు
పాల్గొన్న ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్
జహీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలతో పాటు జహీరాబాద్ పట్టణంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు, గడి మహెల్ లలోని దేవాలయాలలో బోనాలను సమర్పించారు.
పోచమ్మ ఊడలమ్మ దుర్గమ్మ ఎల్లమ్మ తదితర దేవాలయాలలో భక్తులు నెత్తిపై బోనంతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు, మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యునూస్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులతో శివశక్తుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో తిలకించేందుకు పట్టణంలోని ప్రజలు తరలివచ్చారు.
ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పంటలు బాగా పండి జహీరాబాద్ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. జరా సంఘం మండలం బర్దిపూర్ గ్రామంలో బోనాలు ఊడరమ్మ దేవతకు ఘనంగా సమర్పించారు .ఊడరమ్మ బోనాలను ఇంటింటి నుంచి తీసుకువచ్చి సమర్పించారు.
గ్రామ సర్పంచ్ రాజు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటును అందించారు. వార్డు సభ్యులు, పెద్ద మొత్తంలో ప్రజలు హాజరు కావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కౌన్సిలర్లు జాకీర్, నాగేష్ జమీలుద్దీన్ , అతిక్ అక్క అక్రమ్, నిజాముద్దీన్, జాఫర్, రఫీ బి ఆర్ ఎస్ నాయకులు నగేష్ పటేల్ , ఫయాజ్, ఆజాం,మహిళా అధ్యక్షుrరాలు మంజుల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగిరెడ్డి, బర్కత్, శేఖర్, హిమాయత్ తదితరులు పాల్గొన్నారు






