రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్, ఆగస్ట్ 9 (విజయక్రాంతి): విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల శాఖ అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి నేతృత్వంలో అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు కోటయ్య, దీకొండ వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి బోడ బాలాజీ, గట్టు సోమయ్య తదితరుల ప్రతినిధి బృందం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యను ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యం కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సబ్ ట్రెజరీ ఆఫీస్, అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ఎంపీ ని కోరారు. అలాగే తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్మించిన తమ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం అభివృద్ధి పనుల కోసం కూడా సహకరించాలని వారు ఎంపీ కడియం కావ్యను అభ్యర్థించారు.






