8 August, 2026 | 2:49 AM

కలెక్టరేట్‌లో ఘనంగా బోనాల సంబురాలు

08-08-2026 01:44 AM

డాన్స్ చేసి ఉత్సాహపరిచిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ 

మేడ్చల్, ఆగస్టు 7(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగినులు బోనాలు ఎత్తుకొని పోతరాజుల  విన్యాసాలు, దప్పు చప్పులతో భువనేశ్వరి మాత ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అందరితో కలిసి డాన్స్ చేసి ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు సుగుణబాయి, చంద్రావతి, రేణుక బాయి చంద్రకళ, రాధిక, పద్మజ, కాంతమ్మ, గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, మైనింగ్ ఏడి సైదులు, డి ఆర్ డి ఓ సాంబశివరావు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.