8 August, 2026 | 2:48 AM

రోడ్డుపై నాట్లు వేస్తూ నిరసన

08-08-2026 01:44 AM
  1. ముస్తాబాద్,దుబ్బాక రహదారిలో గుంతలు 
  2. మరమ్మతులు చేపట్టాలి బిజెపి నాయకులు

ముస్తాబాద్,జూలై 7( విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి దుబ్బాక వెళ్లే రహదారి గుంతల మయంగా మారడం వర్షపు నీటీతో నిండిన గుంతల్లో వరి నాట్లు వేస్తూ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు క్రాంతి మాట్లాడుతూరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందన్నారు. ముస్తాబాద్ నుండి దుబ్బాక వెళ్లే రహదారి డబుల్ రోడ్డు మంజూరైన ఇప్పటి వరకు రోడ్డు పనుల ఊసే లేదన్నారు.ప్రజలు గుంతల్లో ప్రయాణించి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడానికా? అని ప్రశ్నించారు.

అధ్వానంగా తయారైన రోడ్లు,మోకాళ్ళ లోతు గుంతలతో ప్రయాణికులు ప్రతి రోజు నరకయాతన పడుతున్నారని తెలిపారు.శుక్రవారం భారతీయ జనతా పార్టీ పక్షాన నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశామని పేర్కొన్నారు.నాయకులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తూ తక్షణమే ఈ గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్‌అంజగౌడ్,జిల్లా కార్యదర్శిసంజీవ్, మండల ప్రధానకార్యదర్శులు గోపికృష్ణ, మహేశ్వరి, మొర్రాయిపల్లె సర్పంచ్ శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు తిరుపతి, మహేష్,ప్రశాంత్, మహేందర్,కార్తీక్ రెడ్డి, వెంకన్న,సత్యం,అనిల్, ప్రశాంత్,వేణుగోపాల్, హరీష్,నవీన్,వినయ్, ఆకాష్,సాయి,నర్సింలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.