కొల్లూరులో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు
11-08-2026 12:57 AM
రామచంద్రపురం, ఆగస్టు 10 (విజయక్రాంతి) : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరులో మధు యాదవ్, వెంకటేష్ యాదవ్, డిస్కో మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ పాల్గొన్నారు.
పోలీసుల పరిరక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలారం బండి ఉరేగింపు జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు మా ఊరి పై చల్లగా ఉండాలనీ అమ్మ వారి దయ వల్ల మా ఊరిలో ప్రతి పండుగ కుల మతాలకు ,రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకుంటామని తెలిపారు.






