అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు
11-08-2026 12:56 AM
సికింద్రాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆషాడ మాస బోనాల జాతర సందర్భంగా న్యూ బోయినపల్లి కృష్ణారెడ్డి కాల నీలో ఆర్యాంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో అమ్మవారి ఫలహర బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేసి ఫలహర బండి ఊరేగింపు ప్రారంభించారు. బ్యాండ్ మేళల చప్పుళ్లతో పోతురాజుల నృత్యాలతో యువత తీన్మార్ డ్యాన్స్ తో ఊరేగింపు పురవిధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జంపన రాజేష్,నిర్వాహకులు కవిన్ మోను,అభిషేక్, సూర్య తదితరులు పాల్గొన్నారు.






