20 July, 2026 | 8:40 PM

వెంపటిలో మాసం బోనాల వేడుకలు

20-07-2026 01:48 AM

అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు 

తుంగతుర్తి, జూలై 19 : తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల పండుగను మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకున్న బోనాలను తలపై మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మ వారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బట్టుగూడ ముత్యాలమ్మ తల్లికి బో నాలు సమర్పించి గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని భక్తులు ప్రార్థించారు.

ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తుల జయజయధ్వానాలతో బోనాల వేడుకలు వైభవంగా సాగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.