20 July, 2026 | 8:41 PM

మధ్యాహ్నం భోజన కార్మికులకు పదివేల వేతనం ఇవ్వాలి

20-07-2026 01:50 AM

మహిళా శ్రామిక కార్యదర్శి ఏకలక్ష్మి 

పాలకవీడు, జూలై 19 :మధ్యాహ్నం భోజన కార్మికులకు రూ.పదివేల వేతనం ఇవ్వాలనీ శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి ఏకలక్ష్మి అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల మండల మహాసభ  ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. ఈ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో నిర్ణయించిన రూ.10 వేల వేతనం ఇవ్వాలని, కోడిగుడ్లు, గ్యాస్, పప్పు, నూనెలు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక డ్రెస్ కోడ్ కాటన్ చీరలు,

రిటైర్మెంట్ బెన్ఫిట్ రెండు లక్షలు ఇవ్వాలన్నారు. అనంతరం మండల నూతన కమిటీ ఎన్నుకొన్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా నాగలక్ష్మి , ప్రధాన కార్యదర్శి ఎస్ కె నబు, సహాయ కార్యదర్శిగా నాగమ్మ, ఉపాధ్యక్షులుగా రమణ, సహాయ కార్యదర్శి రమావత్ పూరిలను ఎన్నుకున్నారు  ఈ కార్యక్రమంలో కార్మికులు అన్నపూర్ణమ్మ, బి లావణ్య, మందరి లలిత తదితరులు పాల్గొన్నారు.