10 August, 2026 | 2:56 AM

శంకర్‌పల్లిలో ఉత్సాహంగా బోనాల పండుగ

10-08-2026 12:34 AM

శంకర్‌పల్లి, ఆగస్టు 9(విజయ క్రాంతి): శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని పలు వా ర్డులలో ఆదివారం బోనాల పండుగలను ప్ర జలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మండలం లోని పలు గ్రామా లలో కూడా బోనాల పండుగను ప్రజలు జరుపుకున్నారు. ఆర్యభట్ట పాఠశాలలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్ ఉత్సాహం గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాఠశా ల డైరెక్టర్ రమేష్ బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురిం చి విద్యార్థులకు వివరించారు. కాగా శంకర్ పల్లి పట్టణంలో మహిళలు తలపై బోనాల నైవేద్యం పెట్టుకొని భాజా భజంత్రీలతో స్థా నిక పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించుకున్నారు. వేల సంఖ్యలలో భక్తు లు పోచమ్మ దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు.