10 August, 2026 | 6:22 AM

డప్పు మోగింది.. ఊరు ఊగింది

10-08-2026 12:37 AM

కేతిరెడ్డిపల్లిలో ఘనంగా బోనాల వేడుకలు

మొయినాబాద్ ఆగస్టు 9(విజయ క్రాం తి): మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో కే.ఎన్.ఆర్. గ్రూప్ ఆధ్వర్యంలో బోనాల ప ండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొ ని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు కొత్త కుండల్లో బోనాలను సిద్ధం చేసి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిం చి సంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం అ మ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో కళాకారు లు ప్రదర్శించిన వినూత్న డప్పుల విన్యాసా లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల మోతతో గ్రామ వీధులు మార్మోగగా.. యు వత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి వేషధారణలో కళాకారుల ప్రదర్శనలు, శివసత్తుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కే.ఎన్.ఆర్. గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలు భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక సందడితో ఘనంగా సాగాయి.