ఎల్లమ్మకు బోనాలు
29-07-2026 12:00 AM
నిర్మల్ జూలై 28 ( విజయక్రాంతి): మామడ మండల కేంద్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలు మంగళవారం గ్రామదేవత ఎల్లమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా భాజా భజంత్రీలతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






