17-06-2025 07:27:07 PM
ముత్యాల, పోచమ్మకు, నల్లపోచమ్మకు, జనసంద్రంగా, కదిలిన గ్రామస్తులు..
మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లలో మంగళవారం ముత్యాల పోచమ్మ, నల్లపోచమ్మకు అంగరంగ వైభోవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆడపడుచులు వీధివీధిన బోనాలు ఎత్తుకొని బాజా భజంత్రీలు, పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల సిగలతో, యువకులు డీజే స్టెప్పులతో బోనాలు తీసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి-సాయిలు, సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు, కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు కమ్మరి భాస్కర్, సాయిలు, రవి, వెంకటరమణ, అంజయ్య, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.