లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బి జోన్ సెంటర్ లో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో 150 మంది పేషెంట్స్ కు కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 32 మందికి మాత్రమే ఆపరేషన్ అవసరం ఉందని వైద్యులు డా.సుగుణాకర్ రెడ్డి(Dr. Sugunakar Reddy), డా.మోదుంపురం వెంకటేశ్వర్(Dr. Modumpuram Venkateswar) తెలిపారు.
ఈ నెల 30 కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో 32 మంది పేషెంట్ల ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత బస్సు సౌకర్యం, భోజన వసతులు కల్పిస్తున్నట్లు పట్టణ లయన్ అధ్యక్షులు గాజుల రాజేష్ ఖన్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, కిష్టయ్య, వేణుగోపాల్, ఆడెపు తిరుపతి, కంభగోని సుదర్శన్ గౌడ్, సత్యనారాయణ, వేముల వెంకటేశం, దేవేందర్, వనం సత్యనారాయణ, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




