7 August, 2026 | 3:31 AM

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

07-08-2026 02:12 AM

సుల్తానాబాద్ , ఆగస్టు 6 (విజయ క్రాంతి): సంస్కృతిసాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. గు రువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగను విద్యార్థులచే అంగరంగ వైభవం గా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా భావించే బోనాల పండుగను ఆషాడమాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బో నం సమర్పించి కుటుంబం సుఖ సంతోషా లు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారని తెలిపారు.

గతంలో హైదరాబాదుకు పరిమితం అయిన బోనాల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నా రు. పోతరాజు, అమ్మవారి వేషధారణలో వి ద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.