7 August, 2026 | 3:29 AM

కిట్స్ కళాశాలలో బీటెక్ ప్రధమ సంవత్సరం విద్యార్థినులకు అవగాహనా సదస్సు

07-08-2026 02:11 AM

కిట్స్ విద్యా సంస్థల చైర్మన్ నీల సత్యనారాయణ

కోదాడ, ఆగస్టు 6: ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడుకున్న సాంకేతికను,విద్యను  అందించే ఉమ్మడి జిల్లాలోని ఏకైక ఇంజనీరింగ్ మహిళా కళాశాల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అని చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. గురువారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

బీటెక్ కోర్సుతో త్వరగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పొందవచ్చునన్నారు.కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. విద్యార్థినిలు కళాశాల యాజమాన్యం కల్పించే అన్ని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని, బీటెక్ మొదటి సంవత్సరం నుండే కష్ట పడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రతీకగా కిట్స్ కళాశాల  నిలుస్తుందన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ  విభాగాధిపతులు రమేష్,నరేశ్ రెడ్డి,స్రవంతి,శివాజీ,లక్ష్మణ్,అధ్యాపకులు,విద్యార్థినులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.