తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగను విద్యార్థులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా భావించే బోనాల పండుగను ఆషాడమాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి కుటుంబం సుఖ సంతోషాలు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారని తెలిపారు. గతంలో హైదరాబాదుకు పరిమితం అయిన బోనాల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. పోతరాజు, అమ్మవారి వేషధారణలో విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.






