శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని జీఎం కార్యాలయంలో ప్రొఫేసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురు వారం ఘనంగా నిర్వహించారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన అనంతరం శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కల సాకారానికి కృషిచేసిన గొప్ప విద్యావేత్త, అభ్యుదయ వాది, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రోఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్పవ్యక్తి అని అన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమాలలో గణాంకాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి రాష్ట్రసాధనకు కృషిచేశారన్నారు. అనంతరం జీఎం కార్యాలయ అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.






