6 August, 2026 | 5:13 PM

బహదూర్‌పేట్‌లో యువ వికాస్ కార్యక్రమం నిర్వహణ

06-08-2026 04:21 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బహదూర్‌పేట్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్‌ను మేరా భారత్ కేంద్ర–తెలంగాణ–యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధులు కలిసి యువ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యువజన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, యువత సన్మార్గంలో నడుచుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు ప్రజల అభివృద్ధికి యువత సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆలేరు మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జంపాల శ్రీనివాస్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు దొంతుల ఎల్లేష్, జనరల్ సెక్రటరీ కుండే సంపత్‌తో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు.