సుల్తానాబాద్ లో జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులు
06-08-2026 04:16 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బిఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ '"జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా చేసుకుని ఉద్యమించిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎంపిటిసి సూర శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మాజీ సర్పంచ్ బోయిని రాజ మల్లయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, కనవేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.






