6 August, 2026 | 5:10 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

06-08-2026 04:19 PM

చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

ఇంటింటికి ఐదు మొక్కలు పంపిణీ

గణపురం,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఐదు  మొక్కలు పంపిణీ చేశారు. చెట్లు నాటడం వల్ల వర్షాలు పెరుగుతాయని, కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మొక్కలు పెంచడం తప్పనిసరి అని సూచించారు. పంపిణీ చేసిన మొక్కలను అందరూ బాధ్యతగా నాటి సంరక్షించాలని కోరారు. పచ్చదనంతో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుదామని సర్పంచ్ అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడే బాధ్యత కూడా మనదేనని గుర్తు చేశారు.