ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు
06-08-2026 04:23 PM
ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి, త్యాగం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే తన జీవిత ధ్యేయంగా భావించి, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంగల పవన్, గొట్టిముక్కల వెంకటరమణ, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ రామోజు రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.






