6 August, 2026 | 6:37 PM

ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు

06-08-2026 05:00 PM

బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, మాజీ ఎంపీపీ మండల అధ్యక్షులు పంద్రా జైవంత్ రావు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఉట్నూర్‌లోని కొమరం భీమ్ ప్రాంగణం గ్రంథాలయంలో  బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో  ఆచార్య జయశంకర్  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్వీ నాయకులు విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, మాజీ ఎంపీపీ  పంద్రా జైవంత్ రావులు మాట్లాడుతూ... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ భావజాలం వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మేధావి అని, తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ఎప్పటికీ మరువదని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆజ్మీరా జయ చంద్ర కాటం రమేష్ సిడం సోనె రావు సడిగే రాజ్ కుమార్ దుట మహేందర్ జాధవ్ గిరి నాయక్ సాదీక్ సిద్ధికి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.