22-06-2025 05:36:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) నర్సాపూర్(జి) మండల కేంద్రంలో ఆదివారం పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలను సమర్పించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసానికి ముందు పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలో మహిళలు బోనాలను ఎత్తుకొని ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.