calender_icon.png 17 June, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపూర్‌లో గ్రామదేవతలకు బోనాలు

16-06-2025 12:00:00 AM

తూప్రాన్, జూన్ 15 : శివసత్తుల శిగాలు, పోతరాజుల గావు రంగాలతో మల్కాపూర్ గ్రామం మారుమ్రోగింది. ఈ నెల 15 నుండి 18 వరకు గ్రామ దేవతల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం బొడ్రాయికి జలాభిషేకం, మధ్యాహ్నం ముత్యాలమ్మ, రేణుక మాత, నల్ల పోచమ్మ, కనక దుర్గమ్మలకు బోనాల సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది.

సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండగ, మంగళవారం మహంకాళి అమ్మ పండుగ, బుధవారం దుర్గమ్మ పండగ, గావు రంగాలతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మహదేవీ నవీన్, తాజా మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు,పాల్గొన్నారు.