18 April, 2026 | 12:28 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

కష్టజీవికి బాసటగా నిలబడిన కవి శ్రీశ్రీ

16-06-2025 12:00 AM

శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా తెరవే నివాళి

కామారెడ్డి, జూన్ 15 ( విజయక్రాంతి): కార్మిక కర్షక లోకానికి అండగా నిలబడి తన రచనలతో సమాజంలో మార్పులు తెచ్చిన మహాకవి శ్రీ శ్రీ అని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కర్ష కర్షక్ బిఈడి కళాశాలలోశ్రీ శ్రీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక సంఘం జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్ష క్ మాట్లాడారు.  శ్రీశ్రీ రచనలు ఎప్పటికీ స్ఫూర్తిదకం గా నిలిచాయని అన్నారు.    శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ  శ్రీశ్రీ ఒక అభ్యుదయ కవిగా విప్లవ కవిగా శ్రామిక వర్గానికి  ప్రతినిధిగా తన రచనలు చేసి తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి శ్రీ శ్రీ అని అన్నారు.

శ్రీశ్రీ అక్షరాలను తూటాలుగా పేల్చి చిన్న పదాలలో గొప్ప అర్థాన్ని చెప్పే విధంగా తన సాహిత్యాన్ని సమాజానికి అందించి కష్టజీవికి బాసటగా నిలబడ్డారని నేటి కవులు ఆయన రచనలను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి మేలు చేసే మంచి రచనలు చేయాలని తెలిపారు.  శ్రీశ్రీ నివాళి కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రతినిధులు  ఎనిశెట్టి గంగా ప్రసాద్,  కాసర్ల రామచంద్రం, నాగభూషణం, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.