2 April, 2026 | 2:59 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

ఇక రుణాలు తీసుకోవడం సులభం!

27-08-2024 12:00 AM

యూపీఐ తరహాలో యూఎల్‌ఐ n ఆర్‌బీఐ గవర్నర్ శశికాంత్ దాస్ వెల్లడి

బెంగళూరు: యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్తతరహా సేవలకు నాంది పలకనుంది.రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్‌ఐ)ను జాతీయస్థాయిలో త్వరలో లాంచ్ చేయనుంది. గతేడాదే ’ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్’ పేరిట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ.. అది సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది.

* ‘డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏవిధమైన పాత్ర పోషిస్తోందో.. రుణ వితరణలో యూఎల్‌ఐ కూడా అదే పాత్ర పోషించబోతోంది. దేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక నిర్వహించబోతోంది’ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బెంగళూరులో  సోమవారం నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.

* భూ రికార్డులు మొదలుకొని, ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్‌ఐ పనిచేస్తుందని చెప్పారు. దీనివల్ల రుణ ఆమోద ప్రక్రియ సరళతరం కానుందని తెలిపారు. రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంత దాస్ వివరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 17న ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా దీన్ని చేపట్టారు.