22 June, 2026 | 1:17 AM

విప్లవాభిమన్యుని మరణానికి ముప్పు ఏండ్లు...

22-06-2026 12:00 AM

సంచలనం సృష్టించిన రమాకాంత్ ఎన్ కౌంటర్

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘటన

మంచిర్యాల, జూన్ 21 (విజయక్రాంతి): సింగరేణి కార్మికోద్యమంలో తమదైన ము ద్ర వేసుకున్న పీపుల్స్ వార్ అనుబంధ కా ర్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) నేత మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ ర మాకాంత్ ఎన్ కౌంటర్ జరిగి రేపటి(ఈ నెల 23)కి సరిగ్గా 30 ఏండ్లు... అప్పట్లో సికాస సింగరేణిలో పిలుపునిస్తే మొత్తం వ్యవస్థ స్తంభించేది.

సింగరేణిలో జరిగిన అనేక సం ఘటిత, సమరశీల దీర్ఘకాలిక పోరాటాలకు నాయకత్వం వహించిన సికాస నేత రమాకాంత్ కార్మిక సమస్యలపై పిలుపునిస్తే సిం గరేణిలో 56 రోజుల నిరవధిక సమ్మె జరిగిందంటే సింగరేణిలో సికాసకు ఎంత ప్రాధా న్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమ్మె దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సికాస ను నిర్మూలించడంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో సికాస నేత రమాకాంత్ తో పాటు ఓ మహిళ, పోలీసులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చ అయ్యింది... 

సరిగ్గా ముప్పు సంవత్సరాల కిందట..

పద్మ వ్యూహంలో కౌరవ సేన చుట్టుముట్టి అభిమన్యుడిని చంపినట్లు మంచిర్యా ల జిల్లా సింగరేణి కార్మిక క్షేత్రం నస్పూర్ లో ఒక కార్మికుని ఇంట్లో రహస్యంగా షెల్టర్ తీ సుకుంటున్న సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి రమాకాంత్ ను పోలీసులు చుట్టుముడితే వీరోచితంగా పోరాడి మరణించిన ఘటన జరిగి ఈ నెల 23 నాటికి సరిగ్గా ముప్పు సంవత్సరాలు. అది సంచలన సంఘటన.

వేలాది మంది ప్రజల ముందు జరిగిన నిజమైన యుద్ధం(ఫైరింగ్)... ఒక్కడే సైన్యమై చెలరేగి వందలాది సాయుధ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గెరిల్లా యో ధుడు రమాకాంత్ ఉరఫ్ మాదిరెడ్డి సమ్మిరెడ్డిని సింగరేణి కార్మిక లోకం ఎవరూ మర చిపోరు... ఈ సంఘటన జరిగి ముప్పు ఏండ్లై నా కార్మికులకు అది ఇప్పటికీ తాజా జ్ఞాపకమే... నాటి పోలీసుల మోహరింపు, తు పాకుల కాల్పుల మోతలు, సజీవ దహనాలు నిన్న మొన్న జరిగిన ఒళ్ళు గగూర్పొడిచే అ నుభవంగా కార్మికులు చెప్పుకొంటారు... ఆ రోజుల్లో సికాస పిలుపునిస్తే వ్యవస్థ సమసిపోయింది. ఒక విప్లవసంఘం పిలుపునిస్తే అప్పట్లో 56 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారంటే సికాస 

అసలేం ఏం జరిగింది...?

1996, జూన్ 23న నాటి నిషేధిత పీపు ల్స్ వార్ అనుబంధ సింగరేణి కార్మిక సమా ఖ్య (సికాస) అగ్ర నేత నస్పూర్ కాలనీలోని ఒక కార్మికుని ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడని, ముఖ్య నాయకు లు సమావేశమాయ్యరని పోలీసు ఇన్ ఫార్మర్ నుంచి వచ్చిన నమ్మదగిన సమాచారం అందుకున్న పోలీసులు, సాయుధ బలగాలు వందలాది మంది ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఇంటి వాకిటను న్న ఆ ఇంటి ఇల్లాలు నిరంజన పోలీసులు కాల్పుల్లో మృత్యువాతపడినట్లు పోలీసులు వెల్లడించగా, పట్టుకొని తీసుకెళ్లి చంపారని హక్కుల సంఘాలు ఆరోపించారు.

పోలీసు ల కదలికలు గమనించిన రమాకాంత్ ఇంటి తలుపులు వేసుకుని పోలీసులు దగ్గరకు రాకుండా ఎదురు కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో సీఐ చక్రపాణితో పాటు అశోక్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. సు మారు 12 గంటల పాటు జరిపిన ఈ కాల్పు లు హోరాహోరీగా జరిగాయి. కాల్పుల శబ్దాలతో కార్మిక కాలనీలు భయాందోళనకు గు రయ్యాయి. గదిలోపల చాలా మంది ఉన్నారనే భావనతో, ఎదురు కాల్పుల్లో అప్పటికే సీఐ, కానిస్టేబుల్ మృతి చెందడటంతో ర మాకాంత్ ఉన్న ఇంటి పై కప్పుకు డ్రిల్లింగ్ తో రంధ్రం చేసి, అందులో నుంచి డీజిల్ పో సి నిప్పంటించారు. చివరకు ఆ మంటల్లో ర మాకాంత్ జూన్ 24న సజీవ దహనమయ్యాడు.

సంచలనం సృష్టించిన ఘటన...

ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కడు అంత మంది పోలీసులను నిలువరించడం సంచలనంగా మారిం ది. ఆ వీరోచిత మరణాన్ని కీర్తిస్తు అనేక మం ది కవులు కవితలు, కథలు, నవలలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 50 మంది కవులు, రచయితలు, జర్నలిస్టులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

పౌర హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేశాయి. సంయమనంతో వ్యవహరించి రమాకాంత్ ను అరెస్ట్ చేసే అవకాశమున్నా చంపడం అప్రజాస్వామికమని ఖం డించాయి. ఇది ముమ్మాటికి రాజ్యాంగేతర అమానుష చర్య అని ఈ సంఘటనపై విచారణ జరుపాలని అప్పటి పౌరహక్కుల సం ఘం నాయకుడు బాలగోపాల్ డిమాండ్ చేశారు. అత్యంత సాహసోపేతమైన రమాకాంత్ ఎన్ కౌంటర్ పై ప్రముఖ దర్శక, నిర్మాత నారాయణ మూర్తి ‘చీకటి సూ ర్యులు’ పేరిట తీసిన సినిమా వాస్తవ విరోచిత ఘటనకు అద్దం పట్టింది.

ఈ సినిమాను సింగరేణి కార్మికులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. రమాకాంత్ ఎన్ కౌంటర్ ను ఆధారంగా చేసుకుని ప్రముఖ రచయిత చందు రచించిన ‘వీరుడు’ అనే నవల కూడా ఆ రోజు జరిగిన సంఘటన ప్రతి అంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అంతే ఉత్కంఠతను ఆవిష్కరించారు. ఇది కూడా సింగరేణి కా ర్మికులు, ప్రజలు, యువత ఎంతో ఆసక్తిగా చదివారు. ఆ ఎన్ కౌంటర్ తో రమాకాంత్ ఓ రియల్ హీరో అనిపించుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.