అనుమతులు గోరంత.. తవ్వేది చెరువు అంత!
- అనుమతులకు మించి తవ్వకాలు
- ప్రజలు అడ్డుకున్న ఆగని రవాణా
- వివాదాస్పదంగా మారిన చెరువు మట్టి రవాణా
- రోజుకు లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి
- అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం
- నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి తాలూకా అంటూ యధేచ్చగా రవాణా
మిర్యాలగూడ/వేములపల్లి జూన్ 21 (విజయక్రాంతి): ఏ వ్యాపారమైన సప్లై డిమాండ్ సూత్రంగా సాగుతుంది. డిమాండ్ ఎక్కువ అయినప్పుడు భారీ లాభాలు పొందవచ్చు. ఇదే సూత్రాన్ని అక్రమార్కులు ఫాలో అవుతున్నారు. పర్మిషన్ గోరంత తీసుకొని చెరు వంత యదేచ్చగా నల్ల మట్టి కొల్లగొట్టి లక్షల ఆదాయం గడిస్తున్నారు.
ప్రకృతి సంపద హరించుకుపోతున్న పట్టించుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తుంది. అధికారుల అలసత్వం కారణంగా వేములపల్లి మండలం మంగాపురం (సల్కునూరు) గ్రా మంలోని చెరువు నుంచి నల్లమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టి రవాణా కొరకు సర్వేనెంబర్ 338 గల భూమిలో 0.660 హెక్టార్లలో (సుమారు 1.25 ఎకరా ల్లో) 5000 మెట్రిక్ టన్నుల కొరకు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు పర్మిషన్లు తీసుకున్నారు.
ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పరిమితికి మించి మట్టి రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా అధికారుల కళ్ళముందే జరుగుతున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సల్కునూర్ గ్రామంలో అధిక లోడుతో వస్తున్న టిప్పర్ల నుండి మట్టి పేల్లలు పడి, వాహనాల ద్వారా వచ్చే దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలోని ప్రజలు ఈ ర వాణాన్ని అడ్డుకొని ఆందోళన చేశారు. మాకు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని మమ్ములని ఎవరు ఏం చేయలేదని ఏం చేయలేరని మట్టి రవా ణా చేసేవారు అంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిబంధనలకు పాతర
నల్ల మట్టి రవాణా మూడు జెసిపిలు 30 టిప్పర్లుగా కొనసాగుతుంది. నిబంధనలను పాటించకుండా రవాణా కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్మిషన్ 5000 మెట్రిక్ టన్నులకు అధికార పార్టీకి చెందిన నాయకుడు తీసుకున్నారు. ఈ చెరువు నుంచి మూడు జెసిపిలతో మట్టిని తవ్వి సు మారు 30 టిప్పర్ల ద్వారా రవాణా కొనసాగిస్తున్నారు.
ఈ రవాణా ఈనెల 15 నుంచి కొనసాగుతుంది. ఒక్క టిప్పర్ లో పరిమితికి మించి ఓవర్ లోడుతో సుమారు 30 టన్ను ల మట్టి రవాణా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క టిప్పర్ మూడు సార్లు రవాణా చేస్తే సుమారు 100 మెట్రిక్ టన్నుల మట్టి వెళ్తుంది.
ఇలా ఒక్క టిప్పర్ లో ఎంత మట్టి వెళ్లడంతో రోజుకు 30 టిప్పర్లు సుమారు 3 ట్రిప్పులు రవాణా చేసిన రోజుకు 2700 మెట్రిక్ టన్నులు సరఫరా జరుగుతుంది. అంటే సుమారుగా రెండు రోజులలో వీళ్లు తీసుకున్న పర్మిషన్ అయిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ అధికార పార్టీ నాయకులు కావడంతో సుమారు 30 టిప్పర్లతో రోజు పర్మిషన్ ఉన్నది అనే సాకుతో రవాణా కొనసాగిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
చెరువు మట్టి రవాణా వలన రోడ్డుపై వచ్చే దుమ్ము కళ్ళల్లో పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధిక లోడుతోపాటు అతివేగంగా వెళుతున్నాయి. ఈ రవాణాపై చర్యలు చేపట్టాలి.
వేములపల్లి మహేష్.
అనుమతులకు మించి తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు
వేములపల్లి మండలం అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి తవ్వకాలను జరిపితే చర్యలు తప్పవు. మార్కు నిర్దేశించిన చోటనే తవ్వకాలు జరపాలి ఒకవేళ వేరేచోట తవ్వకాలు జరిపితే మ ట్టిని తవ్వుతున్న జేసిబిని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం. ఈ విషయంపై ఏడి రవిని వివరణ కోరే ప్రయ త్నం చేయగా చరవాణిలో ఆయన స్పందించలేదు.
వేణుగోపాల్, ఇరిగేషన్ ఏఈ,






