గుప్పుమంటున్న గంజాయి!
- కరీంనగర్ జిల్లాలో పెరిగిన గంజాయి అమ్మకాలు
- విద్యార్థుల నుంచి ఆటోడ్రైవర్ల వరకు
- గ్రామాలకు విస్తరించిన వ్యసనం
కరీంనగర్, జూన్21(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లాలో గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. యు వతను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ ప్యాకెట్ల రూపంలోనే కాకుండా గంజాయి చాక్లెట్ల రూపంలో కూడా వీటిని అక్రమంగా రవా ణా చేస్తున్నారు. కరీంనగర్ నగరంలోని వా విలాలపల్లి, భగత్ నగర్, ఐటీ టవర్ పరిసరాలు, రామ్ నగర్, పద్మనగర్, కిసాన్ నగర్, సప్తగిరి కాలనీ, బొమ్మకల్ ప్రాంతాలు అక్ర మ రవాణాకు ప్రధాన కేంద్రాలుగా మారా యి.
కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్ గ్రామ బస్టాండ్ సమీప ప్రాంతం గంజాయి అడ్డాగా మారింది. రెండురోజుల క్రితం ఆటో డ్రైవర్ మత్తు పదార్థం సేవించినట్లు అనుమానం కలగడంతో పోలీసులు మత్తు పదార్థాలు సేవిం చిన వ్యక్తులను గుర్తించే పరికరంతో పరీక్ష నిర్వహించగా, గంజాయి సేవించినట్లు పాజిటివ్గా నిర్ధారణ అయింది. విచారణలో అత ను గత కొంతకాలంగా గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు, గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి గంజాయి తీసుకొని సేవిస్తున్న సమయంలో పోలీసులు వస్తున్నారని గమనించి దానిని పడవేసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుబడినట్లు అంగీకరించాడు.అనంతరం అతనిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.
తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పేరు, వైద్య నివేదికలో కూడా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ సంఘటన తో విద్యార్థులే కాదు ఆటో డ్రైవర్లు, ఇతర వ్యక్తులు కూడా గంజాయి కి బానిసలు అవుతున్నట్టు తేలింది. సిరిసిల్ల కు చెందిన ఒక నాయకుడి కుమారుడు మత్తు పదార్థాలకు బానిసై మృత్యువాత పడిన సంఘటన ఆందోళన కలిగిస్తున్న అంశం. మానకొండూర్ మండలంలోని కొన్ని గ్రా మాలు కూడా దీనికి ఆవాసాలుగా ఉం టున్నాయి.
పోలీసుల దాడులు: టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలోని వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో విస్తృత దాడులు చేసి, గంజాయి ప్యాకెట్లు, గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న పలువురు నిందితులను అరెస్ట్ చేసినా దందా ఆగడం లేదుము పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాల నుండి ఈ మాదకద్రవ్యాలు కరీంనగర్కు వలస వ్యక్తుల ద్వారా తరలించబడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పెరుగుతున్న గంజాయి సంస్కృతిని అరికట్టడానికి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెంచి నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. గంజాయి విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.






