calender_icon.png 30 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాస్.. పైసా వసూల్..!

30-10-2025 01:00:30 AM

భార్గవ్ మరణంతో బట్టబయలైన ఎంపీడీవో నిర్వాకం

బెల్లంపల్లి, అక్టోబర్ 29 : మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుం డా తన కింది ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉండాల్సిన అధికారి అక్రమ ధనార్ధన కోసం వేధింపులకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకుంటుంది. అధికారం చాటున తన కింద పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దగ్గర నెల నెలా వసూళ్ల పర్వానికి తెర తీసి ఉద్యో గి మరణానికి కారణమవడం అతని ధన దాహాన్ని తేట తెల్లం చేసింది.

బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయం మామూళ్లకు అడ్డాగా మారిపోయిందన్న విషయం తెలిసి విస్తు పోవాల్సి వస్తుంది. రాజకీయ పలుకుబడి, అధికార హుంకరింపే అక్కడ రాజ్యమే లుతుంది. పై అధికారికి ఎక్కడ అడ్డు చెప్పలేని ఉద్యోగుల బలహీనతే ఆ అధికారికి కాసులు కురిపిస్తుంది. కానీ ఉద్యోగుల చెమట చుక్కల మీద కూడా కమీషన్ల రూపంలో డబ్బు సంపాదించవచ్చని తనదైన శైలిలో నిరూపించారు బెల్లంపల్లి ఎంపీడీవో కె. మహేందర్.

అతడు మామూలు అధికారి కాదు. చూడటానికి చాలా సింప్లిసిటీగా కనిపిస్తారు. చిరునవ్వు మోముతో సుతి మెత్తగా వ్యవహరిస్తారు. కానీ అక్కడ అంతా ఆయన రూలే పాటించాలే. ఆయనకు ఎవరు ఎదురు సమాధానం చెప్పిన చిర్రెత్తిపోతారు. వారిపై అసహనం వ్యక్తం చేస్తారు. అసలు తన కార్యాలయంలో నుంచి చిన్న విషయం కూడా బయటికి పొక్కనీయరు. ఉన్నతాధికారులను తానే మేనేజ్ చేస్తారు. మండలంలో ప్రముఖ హస్త వాసికి కూడా అత్యంత సన్నితంగా వ్యవహరిస్తూ ఉద్యోగులకు, సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు.

తాను ఎంత చెబితే అంత, అతనికి కోపం వచ్చిందంటే  ఉద్యోగులు బలి కావాల్సిందే. సారు, కారులో తనదైన దర్పం తో కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ హాజరు పడి ఫీల్ విజిట్ పేరుతో గ్రామాలలో తిరిగి తన కింద పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తారు. గ్రామాలలో ఉద్యోగులు చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ కన్నేసి ఎక్కడైనా చిన్న లోపం కనిపిస్తే దాన్ని సాకుగా చూపెట్టి ఉద్యోగికి మెమో సిద్ధం చేస్తారు.

సారు, మెమో ఇచ్చాడంటే ఇక తిరుగుండదు... దయ, కనికరం అసలే చూపరు... ప్రతి ఉద్యోగి నెల జీతం నుంచి ఎంతో కొంత సారుకు ముట్టాల్సిందే. ఇది అక్రమం అని తెలిసిన సారు(బాస్) పెద్దగా పట్టించుకోరు. ప్రతినెల ఒక్కొక్క శాఖ నుంచి ఎంతో కొంత ముక్కు పిండి మరి వసూలు చేస్తారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నుంచి నిస్సిగ్గుగా మామూళ్లు వసూ లు చేస్తారని ఒక శాఖకు చెందిన ఉద్యోగులు బాహాటంగా బయటకు చెప్పడంతో సారు (బాస్) భాగోతం బట్టబయలైంది. ఈ అవినీతి వ్యవహారంలో నుంచి బయటపడేందుకు ఎంపీడీవో మహేందర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

తాను డబ్బులు వసూలు చేయడం లేదని, గ్రామాలలో పూర్తి చేసిన ఈజీఎస్ పనులకు సంబంధించిన నివేదిక బోర్డులు ఏర్పాటు చేయకుండా సిబ్బంది రూ. 5 లక్షలు స్వాహా చేసినందుకు వారం కిందట మెమో ఇచ్చి అధికారుల ఆదేశాల మేరకు టీఏలకు షోకాజ్ నోటీసులు అందించినట్లు చెప్పుకొస్తున్నారు. ఉద్యోగుల నుంచి లంచాల రూపంలో మామూళ్ళు వసూలు చేస్తూ తెరవెనక అవినీతి దందా నడిపిస్తున్న ఎంపీడీవో మహేందర్  పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.