calender_icon.png 30 October, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుధ్య వాహనంగా అంబులెన్స్?

30-10-2025 12:59:45 AM

-సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ ల దుర్వినియోగం 

-అధికారుల సొంత అవసరాలకు అవే..

-కార్మికులకుఅందనిసేవలు

మణుగూరు, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : మణుగూరు ఏరియా సింగరేణి ఆస్పత్రిలో వింత పరిస్థితి నెల కొంది. కార్మికుల సంక్షేమం కోసం సింగరే ణి యాజమాన్యం ఏర్పాటు చేసిన అంబు లెన్స్ సేవలు దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తుంది. అధికారుల పర్యవేక్షణ కొర వడటం, కొందరు అధికారుల నిర్లక్ష్యానికి తోడు, ఓ కాంట్రాక్టర్ తీరుతో అంబులెన్స్ సేవలు పక్కదారి పడుతున్నాయి. ఏరియా లో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయాల్లో సేవలను అం దించేందుకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఏర్పా టు చేసినమార్చురీ అంబులెన్స్ తో అధి కారులుపారిశుద్ధ్య పనులు, వీధి కుక్కలను చంపేందుకు వినియోగిస్తున్నట్లు ఆరోపణ లు వెలువడుతున్నాయి. సింగరేణి ఆస్పత్రి లో అంబులెన్స్‌ల దుర్వినియోగంపై విజయక్రాంతి కథనం..

ఏరియా సింగరేణి ఆసుపత్రిలో అంబులెన్స్ ల దుర్వినియోగం ఏరియా ఆసుపత్రి పరిధిలో కార్మికుల అవసరాల కోసం ఏడు అంబులెన్స్ లను టెండర్ విధానం ద్వారా యాజమాన్యం ఏర్పాటు చేసింది. అందులో మూడు మైన్ల పై, మరో మూడు ఏరియా ఆస్పత్రికి కేటా యించారు. మరో అబ్బులెన్సును ఆసుపత్రిలో మార్చురీ వాహనంగా అందుబాటులో ఉంచారు. ఇందులో ఏసీ సౌకర్యం, శవ పేటిక, ఆక్సిజన్ సిలిండర్ ,క్యా బి న్లో రెండు ఫ్యాన్లు, అన్ని వైద్య పరికరాల కు స్థలం, అంటే, వెంటిలేటర్, వంటి సౌక ర్యాలతో ఏర్పాటు చేశారు. కాగా మృతి చెం దిన కార్మికుల మృత దేహలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని వారి స్వస్థలాలకు తరలించేందుకు ఈ వాహనాన్ని విని యో గిం చాల్సి ఉంది.

కానీ ఏరియా ఆసుపత్రిలో కొందరు వైద్యులు, సిబ్బంది, ఏరియాలో ప నిచేసే ఓ ఉన్నత అధికారి నిర్ల క్ష్యంతో ఆ వాహనం లోని పలుభాగాలను తొలగించి ఆ వాహనాన్ని కుక్కలనునివారించేందుకు, పారిశుద్ధ్య నిర్వహణకు బ్లీచింగ్ వంటి పనులకు వినియోగిస్తున్నారు. అంతే కాకుండా ఓ ఉన్నత అధి కారి, మరి కొంత మంది వైద్య సిబ్బంది మరో అంబులెన్స్ ను సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఆపదలో వాడాల్సిన  అంబులెన్స్ కొందరు చిన్న చిన్న. వ్య క్తిగత పనులకు, కిరాణా సరుకులు, ఇతర ప నులకు వాడుతున్నట్లు సమాచారం. వాహనాల నిర్వహణపై పర్యవేక్షణ కరువవడంతో ఈ పరిస్థితి నెలకొందని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇంతేగాక కొరియర్, రెస్టారెంట్ల నుం చి బిర్యానీలు తీసుకు రావడానికి, వ్యక్తిగత పనులకు 10 నుంచి 25 కిలో మీటర్ల మేర అంబులెన్స్ ను పంపిస్తూ సొంత వాహనాలుగా వాడుకుంటున్నట్లు తెలుస్తుంది.

టెండర్ ద్వారా మెయింటెనెన్స్...

జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్ హా స్పిటల్ తో పాటు ఇల్లెందు, ఏరియా హాస్పిటల్స్ ల్లో నాలుగు చొప్పున అంబులెన్స్ లు ఉన్నాయి. కానీ మణుగూరు ఏరియాలో టెండర్ పద్ధతిలో అద్దె ప్రాతి పదికన ఏడు అంబులెన్స్లను  సింగరేణి యాజమాన్యం వి నియోగిస్తోంది. అత్యవ సర సమయాల్లో పే షెంట్లను ఇంటి నుంచి హాస్పిటల్ కు, ఏ రియా హాస్పిటల్ నుండి కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్, రిఫరల్ పే షెంట్స్ ను హైదరాబాద్ లోని వివిధ హాస్పిటల్స్ తరలించేందుకు అంబులెన్స్ లను వాడుతారు. మైన్ ప్రమాదాలు, యాక్సిడెంట్లల టైంలోనూ ఇవే అంబులెన్స్ లను విని యోగిస్తుంటారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అంబులెన్సులు కార్మిక అవసరాలకు కాకుండా అధికారుల సొంత అవ సరాలకు వినియోగిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

పర్యవేక్షణ లోపం సంస్థకు నష్టం ..

మణుగూరు ఏరియా సింగరేణి ఆస్పత్రిలో ఒక్కొక్క అంబులెన్స్ రూ. 90 వేలు ప్రతిపాదికన నెలవారీ గా చెల్లిస్తుండగా, పా ర్థివ దేహ వాహనానికి రూ. 1.40 లక్షలు నెలవారీగా చెల్లిస్తున్నారు. మార్చురీ అంబులెన్స్ కు మే నెలలో కార్పొరేట్ లో టెండర్లు ఆహ్వానించగా గోదావరిఖనికి చెందిన యజమాని టెండర్ ను దక్కించుకున్నారు. సింగరే ణి నిబంధనల మేరకు అంబులెన్స్ కు ముగ్గురు డ్రైవర్లు, అదనంగా మరో డ్రైవర్ ఉండాలి.

కానీ ఇవేం పట్టించు కోకుండా ఇద్దరి తోనే పనిచేయిస్తూ సీఎం పిఎఫ్, లే కుండా ఫిట్నెస్ సమయంలో నమోదు చేసి న డ్రైవర్లనే కాకుండా వేరే ఇద్దరు డ్రై వర్లతో విధులు నిర్వహిస్తూ నెలవారి బిల్లులను స్వీకరిస్తూ సింగరేణి ఖజానాను కొల్లగొట్టుతు న్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి వాస్తవానికి అంబులెన్స్ టెండర్ పొందిన వా హనాలను సింగరేణి డివైసీఎం, సింగరేణి వైద్యులు పరివేక్షించాలి. కానీ ఎటు వంటి పర్యవే క్షణ లేకుండా ఆ అంబులెన్స్ కు సింగరేణిలో పనిచేసే ఓ ఉన్నతాధికారి ఆదేశాల తో ఫిట్నెస్, పరివేక్షణ అనుమతులు సింగరేణి వైద్యులు మంజూరు చేయటం పై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి.

అంబులెన్స్ వ్యవహారాలను పర్యవేక్షిం చాల్సిన ఆ అధికారి మాత్రం టెండర్ నుండి బిల్లుల చెల్లింపు వరకు తన మార్క్ చూపిస్తున్నారు. కాంట్రాక్టర్ అందించే నెలవారి ముడుపులకు తలోగ్గి ఇస్టారీతిలో అనుమతులు ఇచ్చారనే ప్రచా రం జోరుగా సాగుతుంది. మరో వైపు కంచే సేను వేసిన చందంగా ఏరియాలో ఏ అంబులెన్స్ కు లేని అధిక టెండర్ ద్వారా లక్షలలో బిల్లులు చెల్లిస్తున్న మార్చురీ అంబులెన్స్ ను వ్యక్తిగత, అవసరాలకు వినియోగిస్తూ, మరో వైపు కార్మికులకు సేవలను అందించకుండా అత్యవసర సమయంలో వాడాల్సిన అంబులెన్స్ ను ఏరియాలో పారిశుద్ధ్య పనులకు, బ్లీసింగ్ వంటి పనులకు వినియోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఆఅధికారితీరు తోనే ఇదంతా జరుగుతుందని కార్మిక సంఘాల నేతలు మండి పడుతున్నారు. కార్మికులకు అత్యవసర సమయాల్లో సేవలందించాల్సిన వాహనాలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో  ఉన్నతాధికా రులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై మ్యాట్రాన్ ని వివరణ కోరగా, తన వద్ద రికార్డులలో అం బులెన్స్ లో పనిచేసే వారి వివరాలు లేవని, నిన్ననే కంప్యూ టర్ ను ఫార్మాట్ చేయడంతో సమాచారం లేదని సమాధానం చెప్పారు. 

అంతేగాక ఇన్చార్జిగా ఓ డాక్టర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయినా తాను అం బులెన్స్ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోనని చెప్పడం ఫై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వైద్యుని వివరాలు అడగగా అంబులెన్స్ లు సొంత వాడకాలకు వినియోగించడాన్ని ఊపే క్షించబోమని చెప్పారు. అంబులెన్స్ మెడిసిన్ తీసుకురావడానికి మాత్రమే వినియోగిస్తారని, మిగతా సందర్భాల్లో కార్మికుల సేవల కోసమే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

అంబులెన్సులు ఎప్పుడూ ఫిట్‌vగా ఉండాలని, లేదంటే టెండర్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సింగరేణి ఉన్నత అధికారులు స్పందించి అంబులెన్స్ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సింగరేణి ఖజానాను కాపాడాలని, కార్మికసం ఘాల నేతలు, ముక్తకంఠంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి సి అండ్ ఎండీ, డైరెక్టర్ల ను కోరుతున్నారు.