ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి
03-06-2026 12:00 AM
మరిపెడ (మహబూబాబాద్) జూన్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండలం తాళ్లఊకల్ గ్రామంలో మంగళ వారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు బోయని ప్రణీత్ సైక్పి వెళ్తుండగా, మట్టి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ వెనుక టైరు బాలుడి తలపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి అకాల మరణం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న మరిపెడ ఎస్త్స్ర గండ్రాతి సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






