9 July, 2026 | 12:25 PM

ట్రాక్టర్ రొటోవేటర్‌లో పడి బాలుడు మృతి

11-06-2024 12:45 AM

వరంగల్, జూన్ 10(విజయక్రాంతి): ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా రోటోవేటర్ లో పడి బాలుడు మృతిచెందిన ఘటన సోమవా రం వరంగల్ జి ల్లా నల్లబెల్లి మండలం లైన్స్‌తండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు యశో ద, రాజు దంపతులకు ఇద్దరు కుమారులు. సోమవారం తండ్రి రాజుతో పాటు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన చిన్న కుమారుడు బాలు (12) ట్రాక్టర్‌పై కూర్చున్నాడు.ట్రాక్టర్ వేగం గా వెళ్తున్న క్రమంలో బాలు జారి రోటోవేటర్‌లో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి యశో ద ఫిర్యాదు మేరకు నల్లబెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.