14 August, 2026 | 4:02 AM

న్యాయవాదిపై హత్యాయత్నానికి నిరసనగా విధుల బహిష్కరణ

14-08-2026 01:16 AM

కోదాడ ఆగస్టు 13: నాగర్కర్నూల్ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న వేమగోపాల్రావుపై ఈ నెల 11న జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ కోర్టులోని న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదులపై హత్యాయత్నాలు, దాడులు మరియు బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేజెల్లా రంగారావు,రంజాన్ పాషా, సిలివేరు వెంకటేశ్వర్లు , కోడూరు వెంకటేశ్వర్లు, సీతారామరాజు, దావీదు, నాగరాజు, నవీన్, ఎం.డి. ఉస్సేన్, హేమలత, శిల్పా, సంధ్య, గోవర్థన్, రియాజ్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.