14 August, 2026 | 2:26 AM

వస్త్ర పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి

14-08-2026 01:15 AM

వరంగల్ (మహబూబాబాద్), ఆగస్టు 13 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా గీసుగొండ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో ఘోర ప్రమాదం సంభవించి ఇద్దరు మృతి చెందారు. గణేష ఇకో పెట్ క్లాట్ ఇండస్ట్రీలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సాంకేతిక నిపుణులు మృతి చెందారు. పేలుడుతో షార్ట్ సర్క్యూట్  జరిగి వీరిద్దరూ లిఫ్ట్‌లో చిక్కుకొని ఊపిరాడక అభిలాష్, సూర్య ప్రకాష్ అనే ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.