08-01-2026 01:52:06 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జనవరి 7 (విజయక్రాంతి) : బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని హేమ భార్గవి, జిల్లాలోని అందులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరమని కొనియాడారు. విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమని, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదరపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం అంధులను సన్మానించారు. కార్యక్రమంలో అంధ ఉద్యోగులు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.