24 July, 2026 | 12:47 AM

బఫర్ జోన్‌లో బరితెగింపు..!

24-07-2026 12:02 AM
  1. వర్షాకాలంలో విద్యానగర్‌కు తప్పని ముప్పు
  2. అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు
  3. అనుమతులు కావాలంటే ఆ పార్టీ నేతను కలవాల్సిందే..
  4. అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడండి
  5. వాననీటితో విద్యానగర్ అతలాకుతులం
  6. లబోదిబోమంటున్న స్థానికులు

చుంచుపల్లి జూలై 23, (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో శృతిమించుతున్న ఆగడాలు అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులు.. ఎవరు ప్రశ్నించిన ఐ డోంట్ కేర్.. బడా బాబుల వెనుక నేతల అభయ హస్తం. అధికారులకు తెలిసిన మౌనంగా ఉండడం వెనుక రాజకీయ వేధింపులు ప్రధాన కారణంగా కళ్లకు కొట్టించినట్లు కనపడుతుంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పరిధిలోని విద్యానగర్ పంచాయతీ ప్రాంతంలో బఫర్ జోన్లు బహుళ అంతస్తులు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. 

ఈ నిర్మాణాలన్నీ చింతలచెరువు ఆయకట్టుపైనే యదేచ్చగా నిర్మించ డంతో.. కురుస్తున్న భారీ వర్షాలకు వాన నీరు పల్లపు ప్రాంతానికి వెళ్లాలంటేనే ప్రశ్నగా మిగులుతుంది దీంతో విద్యానగర్ ప్రాంతం 70 శాతం మేరకు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది ప్రజల రాకపోకలకు నరకయాతన తప్పడం లేదు.

అం దుకు ప్రధాన కారణం చింతలచెరువులు నీటి సామర్థ్యం పెరిగినప్పుడు ఆ నీటిని వేరే ప్రాంతానికి తరలించేందుకు పెద్దపెద్ద తూములను అధికారులు ఏర్పాటు చేశారు. ఆక్రములకు గురై డ్రైనేజీ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. దీంతో వాన వాన నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఎటు వెళ్లని పరిస్థితితో విద్యానగర్ ప్రధాన రోడ్డుపైనే నిలిచిపోవడంతో విద్యానగర్ ప్రజలకు వర్షాకాలంలో నరకయాతన పడుతున్నారు. 

బఫర్ జోన్‌లో అక్రమంగా అంతస్తులు నిర్మాణం

ఇప్పటికే వర్షాకాలంలో అతలాకుతలమవుతున్న విద్యానగర్ పంచాయతీకి వాన నీటితో పెనుగండం ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డుకు ఇరుపక్కల పేక మేడలను తలపిస్తూ అనుమతి లేకుండానే బఫర్ జోన్ లో బడా బాబులు విచ్చలివిడిగా భవనాలను ఎలా నిర్మిస్తున్నారో వారి వెనక ప్రధాన పార్టీకి చెందిన నేత అండగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో అధికారుల ఆదేశాలను బేకాతరు చేస్తూ అతిపెద్ద భవనాలు రోజురోజుకినిర్మాణాలువేగమంతమవుతున్నాయి.

ఇవన్నీ తెలిసినప్పటికీ విద్యానగర్ పంచాయతీ పాలన ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉంది. ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ వ్యాపారుల కోసం దాసోహం అయ్యారు తెలియదు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. అదేమని నిలదీసి అడిగితే మేము కట్టొద్దన్న మా మాట వినడం లేదని మేము ఏమి చేయాలి అంటూ అధికారులు ఆవేదనతో జవాబిస్తున్నారు.

మేము కడుతూ ఉంటాం.. మీరు చూస్తూ ఉండండి సవాల్ విసురుతున్న బడాబాబులు

అధికారుల ఆదేశాలు ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘలు ఉల్లంఘనలు ఇవేమీ మాకు కొత్త కాదు ఎవరెన్ని చెప్పిన అనుమతులు లేకున్నప్పటికీ దర్జాగా మేము కడుతుంటాం మీరు చూస్తూ ఉండండి మా వెనక ఎర్ర పార్టీ నేత అండగా ఉన్నాడని మీరు ఏమి చేయలేరు అంటూ బడా బాబులు సవాలు విసురుతున్నారంటే పంచాయతీ చట్టాలను అతిక్రమించి గిరిజన చట్టాలకు తూట్లు పొడిచి దర్జాగా భవనాలు నిర్మిస్తాం ఎవరు చర్యలు తీసుకుంటానికి ముందుకు వస్తారో మేము చూస్తాం అంటూ సవాల్ విసిరుతున్నారు.

అధికారుల్లారా.. ఇకనైనా మొద్దు నిద్ర వీడండి

అనుమతి లేని భవనాలు విద్యానగర్ కాలనీలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం వెనక ఎందుకు ఆలోచిస్తున్నట్టు అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతస్తుల నిర్మాణాలను నిలిపివేయాలని సంబంధిత పంచాయతీ శాఖ అధికారులకు  నీటిపారుదల శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సాదాసీదాగా నోటీసులు ఇస్తున్నామని చెబుతూ వారి కన్షన్లలోని అనుమతులు గుట్టు చప్పుడు కాకుండా ఇస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్న అధికారులకు ఈ భవన నిర్మాణాలు వల్ల పెను ప్రమాదం జరిగితే సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికైనా పంచాయతీ ప్రజల అభ్యర్థన మేరకు సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించి అనుమతి లేని కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

విద్యానగర్ పంచాయతీ సెక్రటరీ వివరణ:

విద్యానగర్ గ్రామపంచాయతీకి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత  ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. గతంలోనే  బఫర్ జోన్ కి ఆనుకొని కడుతున్నటువంటి బవంతులకు నోటీసులు జారీ చేయటం, పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. తాను లేని సమయంలో నిర్మాణాలు చేస్తున్నారని, ఎన్ని విధాలుగా హెచ్చరించిన అక్రమ కట్టడాలు నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. ఈ విషయమై  ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళ అనుమతితో చర్యలు తీసుకుంటాననీ స్పష్టం చేశారు.