13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శాటిలైట్ సర్వేలైన్స్‌తో అక్రమాలకు బ్రేక్

08-01-2026 12:15 AM

సుల్తానాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శాటిలైట్ సర్వే ద్వారా త్వరలోనే అక్రమాలకు బ్రేక్ పడనుందని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేజీ వీల్స్ తో వాహనాలు రోడ్డు పైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు,  బుధవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో కేజీ వీల్స్ వాడకంపై , ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎసిపి గజ్జి కృష్ణ  మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత శాటిలైట్ సర్వే లైన్స్ ఏర్పాటు అవుతాయని, పోలీసులు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ వాహనాల ద్వారా ఇసుకతో పాటు ఏలాంటి అక్రమాలకు పాల్పడిన తమకు తెలుస్తుందని, అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అలాగే కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు నడపడం కారణంగా రోడ్లు చెడిపోతున్నాయని, ఇకముందు కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని అన్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, సంబంధిత అన్ని పేపర్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు, అనంతరం సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్త్స్ర  చంద్రకుమార్ లు మాట్లాడుతూ మానేరు వాగు పరిసర గ్రామాలలో అక్రమంగా ఇసుక డంపు లు ఏర్పాటు చేయవద్దని, పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నే ఇసుక రవాణా జరగాలని వేరే ప్రాంతాలకు తరలి వెళ్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సుల్తానాబా ద్ మండలంలోని ఆయా గ్రామాల ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.