calender_icon.png 9 January, 2026 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుతం.. అంజన్న క్షేత్రం..!

08-01-2026 12:13:02 AM

అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షణ ఆరు కిలో మీటర్ల్లు

మల్యాల, జనవరి 7 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి.  భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గిరి ప్రదక్షిణ’ ప్రాజెక్టు పనులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేగవంతమయ్యాయి. అరుణాచలం, సింహాచలం, చిలుకూరు బాలాజీ తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రభుత్వం నిర్ణయించింది.  కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రాజెక్టు కొరకు అధికారుల అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ల ప్రత్యేక కృషి , చొరవతో సమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గిరిప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు 6 కిలోమీటర్లు ఉంటుంది.

ఇందులో 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్, మిగతా మార్గం మట్టి రోడ్డు ఉండనుంది.

50 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్పాత్ నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సదుపాయాల ఉంటాయి.

1150 మీటర్ల రహదారి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని గుర్తించారు. గిరిప్రదక్షిణకు ఫారెస్ట్ శాఖ పూర్తి సహకారం ఇవ్వలసి ఉంటుంది

ఫారెస్ట్ భూమికి బదులుగా ఎండోమెంట్ భూమి ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది.

గిరిప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు , తదితర అంశాల గురించారు.  గిరిప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఇటీవలే జగిత్యాల కలెక్టర్ ఆదేశించారు.దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి, పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ఈ మార్గాన్ని అత్యంత ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడమే కాకుండా, ప్రయాణం సులభతరం చేసేలా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, తిరుమల తిరుపతి దేవస్థానం  కొండగట్టులో రూ. 35.19 కోట్లతో భారీ సత్రం నిర్మాణానికి ముందుకు వచ్చింది.  టిటిడి సత్రం నిర్మాణం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు ఏకకాలంలో ఊపందుకోవడంతో కొండగట్టు పరిసరాల్లో అభివృద్ధి జోరు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కొండగట్టు భక్తి పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుండి.