6 August, 2026 | 1:22 AM

తల్లిపాలే బిడ్డకు అమృతం

06-08-2026 12:34 AM

రాజాపూర్ ఆగస్టు 5 (విజయక్రాంతి): తల్లిపాలే బిడ్డకు అమృతంతో సమానమని తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ అన్నారు. బుధవారం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలు,బాలింతలకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లులు శిశువుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ నాగేంద్రమ్మ, డిప్యూటీ సర్పంచ్ రామచందర్, మహిళా శిశు దివ్యంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జెండార్ స్పెషలిస్ట్ గీత,అంగన్వాడీ టీచర్ విజయ లక్ష్మి,ఏఎన్‌ఎం సుజాత, వార్డు సభ్యులు  స్వరూప, శ్రీశైలం, అనిల్ కుమార్,ఆశా వర్కర్లు సరోజ, గర్భిణీలు బాలింతలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.