6 August, 2026 | 1:40 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి

06-08-2026 12:33 AM

వనపర్తి మండలం ఆగస్టు 5 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలం రాజపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

గ్రామంలో మంజూరైన 34 ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఎండీ, అవసరానికి మించి బేస్మెంట్ ఎత్తు లేదా స్లాబ్ పరిమాణం పెంచవద్దని లబ్ధిదారులకు సూచించారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రి ధరలపై వివరాలు తెలుసుకున్నారు.