మజీద్‌పూర్‌లో వాటర్‌ప్లాంట్ షురూ
06-08-2026 01:20 AM
అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 5: బూడిద రామ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్లామెట్ మండల పరిధిలోని మజీద్ పూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ ను బుధవారం బీఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేయాలని ఉద్దేశంతోనే ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రియచంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డ్, బీఆర్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.






