ముర్రుపాలతో బిడ్డకు మేలు
అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు
చేవెళ్ల, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడి స్కూళ్ల లో 1,2,3, సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ సమత హాజరై మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి (ముర్రు) పాలు తప్పకుండ పట్టించాలన్నారు.
ముర్రుపాలు బిడ్డకు ఇచ్చే బలం ఏ పోషకాలు ఇవ్వవని, అపోహలు నమ్మకూడదని తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని చెప్పారు. బిడ్డకు రెండు సంవత్సరాలు నిండెన్త వరకు తప్పకుండా ప్రతి తల్లి పిల్లలకు పాలిచ్చే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శైలజ రెడ్డి, శ్రీనివాస్, కళ్యాణి, సిడిపిఓ హెబ్సేబా సూపర్వైజర్ రేవతి, గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ టీచర్స్ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.






