బ్రిజ్‌భూషణ్ కొడుకు కాన్వాయ్ భీభత్సం
30-05-2024 12:40 AM
వాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి
లక్నో, మే 29: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడు చిక్కుల్లో పడ్డారు. కైసర్ గంజ్ బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయ పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో కరణ్ కాన్వాయ్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడంతో బ్రిజ్ భూషణ్‌కు పార్టీ టికెట్ ఇవ్వకుండా, ఆయన కుమారుడు కరణ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.






