27 July, 2026 | 3:18 AM

బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు

30-05-2024 12:45 AM

ఇద్దరు మావోయిస్టులు మృతి

చర్ల, మే 29: మరోసారి మావోయిస్టులు, పోలీసులు తుపాకులు మోటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మెద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బద్దెపర అడవుల్లో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మద్దేడు ఏరియా కమిటీ సభ్యురాలు మనీలా మృతుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈమెపై 12 నేరాలు నమోదు కాగా, రూ.8 లక్షల రివార్డు ఉంది. మద్దేడు ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్ మంగ్లు కుడియం చనిపోయిన వారిలో ఉన్నట్టు తెలిసింది. ఇతడిపై రూ.1 లక్ష రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుంచి రూ.30 వేల నగదు, పలు తుపాకులు, పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో అధికారుల సమక్షంలో 10 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు చంద్రవతి ఏరియా కమిటీకి  చెందినవారు. లొంగిపోయినవారికి పునరావాస పథకం కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు. వారి లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు.