5 June, 2026 | 1:15 AM

ప్రజల చెంతకే పాలన ప్రజాపాలన ఉద్దేశం

05-06-2026 12:00 AM

కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ క్రైం, జూన్ 4 (విజయక్రాంతి): ప్రజల చెంతకే పాలనను తీసుకురావడమే ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ’ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక‘ 99 రోజల కార్యచరణలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ‘ ప్రత్యేక వార్డుల సభలు‘ గురువారం ప్రారంభమయ్యాయి.  ఈనెల 4 నుండి 10వ వరకు నాలుగు రోజుల పాటు ‘ ప్రతేక వార్డు సభలు జరగనున్నాయి. మొదటి రోజు నగరంలోని చింతకుంట, కొత్తపల్లి, రేకుర్తి, సీతారాంపూర్, మల్కాపూర్, విద్యానగర్, పద్మానగర్, రాంనగర్ ప్రాంతాల పరిదిలో గల 14, 15,  16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 46,  47, 48 డివిజన్లకు సంబంధించి రేకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ‘ ప్రత్యేక వార్డుల సభ‘ జరిగింది.

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంబంధిత డివిజన్ల కార్పోరేటర్ల సమక్షంలో  వార్డుల వారిగా ప్రజల సమస్యలు వాటి పరిష్కారం, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పై సభలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ డివిజన్ల వారీగా ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి వార్డుల సభల్లో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. 

డివిజన్ల లో ఆరోగ్య కేందాలు, హెల్త్ సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న పెన్షన్ మ్యాపింగ్ లో ఆన్ లైన్ ఫొటో ఐడెంటిఫికేషన్ కేవైసీ తప్పక చేయించుకోవాలని పిలుపు నిచ్చారు. డివిజన్ల లో శిధిలావస్థలో ఉన్న గృహాల ను గుర్తించి తొలగించాలన్నారు. మీ ప్రాంతాల్లో పార్కుల స్థలాలను కాపాడుకుంటూ... పార్కులను అభివృద్ధి చేస్కోవాలని అన్నారు. డివిజన్ల వారిగా ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సుధగోని మాధవి, పర్వతం మల్లేషం, గంట శ్రీనివాస్,  వాసాల రమేష్, వరాల నర్సింగ్, ఒంటెల సత్యనారాయణ, కాంతాల జగన్ రెడ్డి, అదనపు కమీషనర్ ఆయాజ్, సువార్త, డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు, పలు విభాగాల అధికారులు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.