కుటుంబ కలహాలతో గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త
కూకట్‌పల్లి, జూన్ 4 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో గొంతు కోసి భార్యను హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో గురువారం చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం అస్మా అంజూమ్ సోదరి, సమీరా బేగం(23) కు బోరబండకు చెందిన షేక్ రహీంకు 2024వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
అనంతరం షేక్ రహీం తన భార్య సుమెరా బేగంతో కలిసి ఖైతలాపూర్ ఇందిరమ్మ కాలనీకి మారాడు. వారికీ ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు కూడా కలడు. రహీం ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నా డు. పెళ్లయిన కొంతకాలం నుండే కుటుంబంలో కలహాలు జరుగుతుండేవని, ఈ విషయంపై గతంలోనే భార్యాభర్తలు ఇరువురు వేరువేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని హతురాలు సోదరి ఆస్మా అంజుమ్ తెలిపారు.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో అగ్రహించిన రహీం తన భార్య సుమేరాను కత్తితో గోంతు కోసి హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసి పోలీస్ స్టేషన్ కునేరుగా వచ్చిన నిందితుడుని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, హతురాలు సోదరి అస్మా అంజూమ్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.






