calender_icon.png 23 August, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ మహిళకు కిమ్స్‌లో అరుదైన చికిత్స

23-08-2025 01:16:44 AM

  1. 102 కిలోల నుంచి 70 కిలోలకు తగ్గుదల

విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ కేశవరెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): అధిక బరువుతో బాధపడుతు న్న బ్రిటన్ మహిళకు గచ్చిబౌలి కిమ్స్‌లో నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. లండన్‌కు చెందిన అలెగ్జాండ్రియా ఫాక్స్ భార్య జేన్‌పాక్స్ అధిక బరువుతో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె భర్త అలెగ్జాండ్రియా సైతం అధిక బరువుతో బా ధపడగా 2023 లండన్‌లో బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకొని 64 కిలోల బరువు తగ్గారు.

ఈ చికిత్సను కిమ్స్ మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కేశవ రెడ్డి మన్నూరు లండన్‌లో విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఆమె  ప్రత్యేకంగా వ చ్చి హైదరాబాద్‌లో చికిత్స చేయించుకొని 102 కిలోల బరువు నుంచి 70 కిలోలకు తగ్గారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవరెడ్డి   మాట్లాడుతూ ‘జేన్‌పాక్స్‌కు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందు కు సంబంధించిన పరీక్షలు చేశాం.

ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీ నివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. ఆమె కిడ్నీ వైఫల్యం కూ డా తగ్గింది. 24 గంటల్లోనే జేన్ కోలుకున్నా రు. చికిత్స మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గది లో ఆమె హాయిగా తిరిగారన్నారు.