23-08-2025 01:16:04 AM
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): మోడల్ యునైటెడ్ నేషన్స్ (మూన్) సెషన్లు విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచన, నాయకత్వం వంటి కీలక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. మూన్ సెషన్లు ఐక్యరాజ్య సమితిని అనుకరించే విద్యా సమావేశాలలో ప్రతియొక్క విద్యార్ధి పాల్గొని తమ ప్రతిభ కన బరచాలని కోరారు.
హైదరాబాద్ గుండ్ల పోచంపల్లి డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో శుక్రవారం డిఆర్‌ఎస్ 2025 మూన్ సెషన్లను స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ అంజనీ కుమార్ అగర్వాల్, గర్వ్ అగర్వాల్, ప్రిన్సిపాల్, ఐ. వేణుగోపాల్ లతో కలసి కె.పి. వివేకానంద గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మూన్ సెషన్లు విద్యార్థులకు భవిష్యత్తులో ప్రపంచ దేశాలను పరిశోధించడానికి, ప్రపంచ సమస్యలను చర్చించడానికి, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలను చర్చించడానికి వీలు కల్పిస్తాయన్నారు.
ఈ సెషన్లలో విద్యార్థులు ఉత్సాహభరితమైన సంభాషణలు, అనర్గళమైన వాక్చాతుర్యం ప్రపంచ పౌరసత్వం యొక్క నీతి పట్ల అచంచలమైన నిబద్ధత ప్రదర్శించి తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో మూన్ అధ్యక్షురాలు ఎస్. మేరీ తనూజ, 2025 మూన్ సెషన్ల సెక్రటరీ జనరల్ అద్విక్ రెడ్డి, వివిధ స్కూల్ ల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.