23-08-2025 01:18:07 AM
-నగరంలో 27 వేలకు పైగా ప్రాంతాల్లో పూడిక, చెత్త తొలగింపు
- స్థానికులను భాగస్వామ్యం చేస్తూ ‘హైడ్రా బస్తీతో దోస్తీ’ వినూత్న కార్యక్రమం
హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 22 (విజయక్రాంతి) : వర్షాకాలంలో మహానగర వాసులకు వరద కష్టాలు తప్పించేందుకు హైడ్రా బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. జులై 1 నుంచి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగిన నాటి నుంచి ఆగస్టు 21 వరకు, నగరాన్ని పరిశుభ్రంగా, వరద రహితంగా ఉంచేందుకు ఏకంగా 27,272 ప్రాంతాల్లో పూడిక, చెత్తను తొలగించాయి.ఈ పనులతో పాటు, నాలాల పరిరక్షణలో స్థానికులను భాగస్వాములను చేసేందుకు ‘హైడ్రా బస్తీతో దోస్తీ’అనే వినూ త్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
నాలాల్లో చెత్త వేయకుండా వారిలో చైతన్యం నింపు తూ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తోంది. భారీ వర్షాలకు నగరంలో చెట్లు నేలకూలడం సర్వసాధారణంగా మారింది. రహదా రులకు అడ్డంగా పడి రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న చెట్లను హైడ్రా బృందాలు యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌ల కార ణంగా భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో, సిబ్బంది బైక్‌లపై వెళ్లి కట్టర్లతో కొమ్మ లను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 1 నుంచి ఇప్పటివరకు 810 నేలకొరిగిన చెట్లను తొలగించా రు.
వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపునకు అడ్డుగా ఉన్న కొమ్మలను కూడా తొలగిస్తున్నారు. హైడ్రా బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టాయి. మలక్‌పేట, డబీర్‌పురా దర్వాజా వద్ద గల గంగా నగర్ నాలా నుంచి ఒకే రోజు 15 ట్రక్కుల చెత్తను తరలించారు. అల్వాల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, టోలిచౌకి, పాతబస్తీలోని తలాబ్‌చంచలంలో జేసీబీల సహాయంతో నాలా ల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగిస్తున్నారు.
అమీర్‌పేట మైత్రివనం వద్ద ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తను నిరంతరం తొలగిస్తూ, అక్కడ శాశ్వత పరిష్కారం లభించే వరకు వరద నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. టోలిచౌకిలోని బుల్కాపూర్ నాలాతో పాటు గౌరీశంకర్ బస్తీలో నాలాల శుభ్రత దాదాపు పూర్తికావొచ్చింది. మొత్తంగా, ఈ ఏడాది హైడ్రా తీసుకుంటున్న ముందస్తు చర్యలతో నగరవాసులకు వర్షాకాల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయని చెప్పవచ్చు.